ఆవిషయంలో కేసీఆర్ చంద్రబాబునే అధిగమించేశారు..!

posted on: Jan 21, 2016 5:31PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని ఉపయోగించడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది అందరికి తెలిసిన విషయమే. అలా టెక్నాలజీని ఉపయోగించుకొని.. అభివృద్ధి పంథాలో దూసుకెళుతుంటారు చంద్రబాబు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ విభాగం అంత అభివృద్ది చెందడానికి.. హైదరాబాద్ గురించి పలు దేశాలు చెప్పుకోవడానికి కారణం ఎవరంటే ముందు చెప్పేది చంద్రబాబు గురించే. అందుకే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు పేరు అందరికి తెలుసు.
 
అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబును ఒక విషయంలో అధిగమించారంట. అదేంటీ అనుకుంటున్నారా.. ఇంతకీ విషయం ఏంటంటే. ఇప్పటి వరకూ ఆన్ లైన్ పాపులారిటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుంటే ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబును అధిగమించి ముందున్నార‌ట. ఈవిషయం ఎవరో కాదు గూగుల్ ట్రెండ్సే చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో కేసీఆర్ పాపులారిటీ ఎక్కువైందనే చెప్పొచ్చు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన క్రెడిట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన చేపట్టిన ఆయుత చండీయాగం గురించి కూడా మీడియా అంతా పాపుల‌ర్ అయిపోయారు. అంతేకాదు సింగపూర్, మలేషియా, జపాన్ వంటి దేశాల్లో కూడా కేసీఆర్ గురించి సెర్చ్ చేశారంట. దీంతో ఆన్ లైన్ పాపులారిటీలో కేసీఆర్ చంద్రబాబును మించిపోయారు.

మొత్తానికి రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతున్న ఇద్దరు సీఎంలు.. ఇలా ఆన్ లైన్ పాపులారిటీలో కూడా పోటీ పడుతున్నారన్నమాట. మరి కేసీఆర్ ను ఈసారి చంద్రబాబు అధిగమిస్తారో లేదో చూద్దాం..

google-ad-img
    Related Sigment News
    • Loading...