విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి : సీఎం చంద్రబాబు

posted on: Jan 30, 2026 8:53PM

 

విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం  చంద్రబాబు తెలిపారు. వినూత్న ఆలోచనలకు భవిష్యత్ కాలంలో మంచి అవకాశాలు దక్కుతాయన్నారు. వినూత్నంగా ఆలోచన చేసేవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని... యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి  కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నారు. 

తొలి రోజు పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలంలో ఆగస్త్య విద్యాచల్ అకాడమీ ప్రాంగణంలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ. 3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆగస్త్య విద్యాచల్ అకాడమీ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఏడాదికి 5 వేల మంది టీచర్లు, స్కూల్ లీడర్లను తీర్చిదిద్దేలా ఆగస్త్య విద్యాచల్ అకాడమీ శిక్షణ ఇవ్వనుంది. ఆధునిక, శాస్త్రీయ శిక్షణా కేంద్రంగా అగస్త్య విద్యాచల్ అకాడమీకి జాతీయ స్థాయిలో మంచి పేరుంది. DIETలు, బ్లాక్ రిసోర్స్ సెంటర్లు, లైవ్ ఇంట్రాక్షన్ కోసం టూ వే బ్రాడ్ కాస్ట్ స్టూడియోలతో అత్యాధునిక ఏర్పాట్లు ఈ టీచర్ ట్రైనింగ్ సెంటర్లో చేశారు. 

అకాడమీలోని శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ట్రైనింగ్ సెంటరుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు అకాడమీ ప్రాగంణంలోనే లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మించేలా ప్రణాళికలను సిద్దం చేసింది ఆగస్త్య అకాడెమీ సెంటర్. ప్రస్తుతం 240 మందికి అకాడెమిషన్ ఫెసిలిటీ కల్పిస్తుండగా... దీన్ని మరింత విస్తరిస్తూ ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ నిర్మాణాలు చేపట్టింది. ఇదే ప్రాంగణంలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఒబెరాయ్ విజిటర్స్ సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేశారు. మల్టీ మీడియా ఎక్స్ పీరియన్స్ కలిగించేలా విజిటర్స్ సెంటర్ రూపకల్పన చేసినట్టు ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ ప్రతినిధులు సీఎంకు వివరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...