Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వృద్ధుడి వీడియోపై స్పందించిన సీఎం చంద్రబాబు .. రేపు కలుద్దాం
posted on: Jun 7, 2026 4:07PM

తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వృద్ధుడిని కలుస్తానని మాటిచ్చారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. 'సత్యనారాయణ గారు.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం' అని రాసుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా , పెనుగొండ మండలం కామధేనువులంకకు చెందిన వృద్ధుడు సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలనుకుంటున్నారు.
ఆ వృద్ధుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత అభిమానం ఉందో తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో తాను చంద్రబాబుని ఒక్కసారి చూడాలని ఆ వృద్ధుడు ఆకాక్షించారు. ఆ క్రమంలో ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు పెనుగొండ మండలం సిద్ధాంతం వెళ్లనున్నారు. వృద్దుడి గ్రామం కామథేనువులంక అక్కడికి సమీపంలోనే ఉండటంతో చంద్రబాబును చూడాలన్న ఆయన కోరిక నేరవేరనుంది.






