ఇందులో కూడా హ్యాండిచ్చావా మోడీ జీ...

posted on: Jul 14, 2016 12:17PM

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు.. మంత్రులు.. అధికారుల పనితీరును బట్టి వారికి ర్యాంకులు ఇస్తుంటారు అది తెలిసిన విషయమే. ఆ వచ్చిన ర్యాంకులను బట్టి.. వారి పనితీరును బట్టి నేతలకు క్లాసులు పీకుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ర్యాంకుల విషయంలో చంద్రబాబుకే ఓ ఝలక్ తగిలింది. అదేంటంటే.. ప్రధాని నరేంద్రం మోడీ దేశ వ్యాప్తంగా మంత్రులకు ర్యాంకులు ఇచ్చారంట. ఇందులో చంద్రబాబుకు 13 వ ర్యాంకు లభించడంతో ఆయన షాకయ్యారట. ప్రధాని నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల సీఎంల పనితీరు, ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరు వంటి విషయాలపై సర్వే చేయించారట. ఇందులో చంద్రబాబుకు 13 వ ర్యాంకు వచ్చింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫస్ట్ ర్యాంకు రావడం.

 

 

అయితే ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే.. మోడీ కేసీఆర్ కు ఫేవర్ గా ఉన్నారా.. లేక చంద్రబాబుకు ఫెవర్ గా ఉన్నారా.. అని. ఎందుకంటే ఈ మధ్య నరేంద్ర మోడీ, కేసీఆర్ పై బాగానే అభిమానం చూపుతున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌ని పలుమార్లు అభినందిస్తూ కూడా వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు ఇచ్చేశారు. ఇక టీడీపీ-బీజేపీ మిత్రపక్షం కాబట్టి.. చంద్రబాబుకు, మోడీ మధ్య మిత్రుత్వం ఉంది. అయితే మిత్రపక్షమన్న పేరు తప్ప, చంద్రబాబుని ఎప్పుడూ నరేంద్రమోడీ మిత్రుడిలా చూసిన సందర్భాల్లేవు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు నిరూపించారు మోడీ జీ కూడా. ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కూడా ఏం చెప్పకపోవడం.. ఇంకా కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో కూడా ఏపీపై చిన్నచూపు చూపడం వంటివి చేస్తూనే వచ్చారు. ఆఖరికి ఏపీ రాజధాని శంకుస్థాపన రోజు కూడా ఏం ఇవ్వకుండా మొంచి చేయి చూపించారు. ఇలా, ఎప్పుడూ ఎక్కడా ఏ సందర్భంలో చంద్రబాబుని, ఓ ముఖ్యమంత్రిగా.. మిత్రుడిగా నరేంద్రమోడీ లెక్కల్లోకి తీసుకున్న సందర్భాలే లేవు.

 

 

ఇక ఇప్పుడు ఈ ర్యాంకుల విషయంలో కూడా మోడీ చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు  తన 'ఆప్తమిత్రుడు' వెంకయ్యనాయుడి వద్ద గోడు వెల్లబోసుకున్నారట. ఇంకా ఈ ర్యాంకులను అధికారికంగా ప్రకటించ లేదు కాబట్టి.. ఈలోపు ఏదో విధంగా 'మ్యానిప్యులేట్‌' చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారట. మరి చంద్రబాబు అనుకున్నట్టు జరుగుతుందో.. చంద్రబాబు మంత్రాంగం ఫలిస్తుందా.? ర్యాంకులు తారుమారవుతాయా.? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

google-ad-img
    Related Sigment News
    • Loading...