విజయవాడ మెట్రో పట్టాలెక్కబోతుందా?


 


విజయవాడ మెట్రో రైలు పట్టాలెక్కబోతుందా ? మెట్రో రైలు నిర్మాణం పై కేంద్రం సమాధాన పడిందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అనుకున్న దగ్గర నుండి ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. దీనిపై కేంద్రం కూడా సముఖత చూపలేదు. విజయవాడలో మెట్రో నిర్మించాలంటే దానికి 20 లక్షల పైగా జనాభా ఉండాలని.. అంత జనాభా లేదు కాబట్టి విజయవాడకి మెట్రో అవసరం లేదని తేల్చి చెప్పింది.

కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాగైనా మెట్రోని నిర్మించాలని దీని నిర్మాణానికి కావలసిన అనుమతులు.. వ్యయం గురించి చాలా కష్టపడుతున్నారు. ముందు కేంద్రం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తుందని భావించినా తరువాతం అంత సముఖత చూపకపోవండతో చంద్రబాబే రంగంలోకి దిగి పట్టువీడని విక్కమార్కుడిలా ప్రయత్నిస్తుండటంతో ఈప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించి మెట్రో శ్రీధరన్ తో కూడా ఆయన చర్చించారు. అంతేకాదు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విజయవాడ మెట్రోపై లేవనెత్తిన అభ్యంతరాలకు కూడా శ్రీధరన్ పూర్తిస్థాయిలో సమాధానాలు చెప్పడంతో ఆ వివరణలకు కేంద్రం కూడా సమాధానపడినట్లు సమాచారం. దీంతో కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న మెట్రో ప్రాజెక్టు వేగం పుంజుకుంటుంది


ఈ నేపథ్యంలో మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోమని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసేశారు. దీంతో ఈ నెల తొమ్మిదో తేదీన జరిగే మెట్రో సమావేశంలో రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2018 నాటికి మెట్రో మొదటి దశ పూర్తి కావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాక ఎటువంటి ఎలైన్ మెంట్ మార్పు లేకుండానే.. బస్టాండ్ నుంచి బందరు రోడ్డు వరకు రైల్వే స్టేషన్ నుంచి ఏలూరు రోడ్డు వరకు మొదటి దశలో 26 కిలోమీటర్లు నిర్మాణానికి రూట్ క్లియర్ అయినట్టు సమాచారం. కాగా ప్రముఖ జపాన్ సంస్థ జమైకా మెట్రో నిర్మాణానికి కావాల్సిన సహాయం అందిస్తుంది.. దానితో పాటు కేంద్రం నుండి వచ్చే నిధులను కూడా సమకూర్చుకునేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు అనుకున్నది సాధించినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu