Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉద్యోగుల ఫ్రెండ్లీగా కూటమి ప్రభుత్వం : సీఎం చంద్రబాబు
posted on: Jun 29, 2026 9:39PM
.webp)
సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు..
ఉద్యోగులకు మేలు చేసేలా ఇటీవల కెబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 2004 సెప్టెంబర్ ముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తింపచేయడం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేషన్లకు చెందిన సంస్థలు, గురుకులాలకు చెందిన ఉద్యోగులకు పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది. గత కెబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలుస్తూనే ఉన్నారు.
ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేసిన మేలును మరువలేమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. కూటమి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటోందన్నారు. తాము ఉద్యోగులకు సహకరించినట్టే... ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏపీఆర్ఈఐ సొసైటీతో పాటు.. వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంస్థల సొసైటీలు, డీఎస్సీ 2003 టీచర్ల ఫోరంనకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో గురుకులాల జేఏసీ నాయకులు దామచర్ల మధుసూదన రావు, ప్రభాకర్, రామ్మోహన్ రావు, రమేష్, డీఎస్సీ 2003 ఫోరం ప్రతినిధులు మోపిదేవి శివ శంకర్రావు, గురు బ్రహ్మం, రాజేష్ ఉన్నారు.





