Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్వాంటం కంప్యూటింగ్‌లో ఏపీదే పైచేయి : సీఎం చంద్రబాబు
posted on: Feb 20, 2026 2:05PM
.webp)
ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం త్వరలోనే గూగుల్ వంటి సంస్థల రాకతో గ్లోబల్ ఏఐ డేటా హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచానికి అవసరమైన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను ఏపీలో తయారు చేసేలా ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దుతుమన్నామని తెలిపారు.
రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయి..యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ తో ఏపీ ఒప్పందం చేసుకుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి, దానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశం.
ఈ ఒప్పందాలు రాష్ట్రంలో ఏఐ, క్వాంటం రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు మార్గం సుగమం చేయనున్నాయి. విద్యార్థులు, యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగాన్ని పెంచడం, తద్వారా పాలనను సులభతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరుస కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (యూఎన్ఐసీసీ)తో కలిసి అమరావతి క్వాంటం వ్యాలీలో ఏఐ-క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. దీనిని డిజిటల్ ఎంబసీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం ఐబీఎంతో ఒప్పందం ద్వారా లక్ష మంది యువతకు క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
డీమ్డ్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేసేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నీలిట్)తో ఒప్పందం కుదిరింది. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నీలిట్)తో ఒప్పందం కుదిరింది దక్షిణ భారతదేశంలో తొలి ఏఐ-క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయనున్నారు.స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మాణం, 50 విద్యాసంస్థల్లో ఏఐ అకాడమీలు, అమరావతిలో మరో నైపుణ్య కేంద్రం స్థాపన వంటి చర్యలు చేపడుతున్నారు. అదనంగా ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.






