Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రస్తుత పరిస్థితుల్లో బెస్ట్ బడ్జెట్...సీఎం చంద్రబాబు హర్షం
posted on: Feb 14, 2026 4:31PM

ఏపీ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మెరుగైన బడ్జెట్ పెట్టామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో తెలిపారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందని ఇబ్బందులను అధికగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్‌లో పడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటా వస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
వ్యవసాయం, సేవారంగాల నుంచి ఆదాయం పెరగాలి. రెండుమూడేళ్లలో అమరావతికి స్పష్టమైన రూపు వస్తుంది. అక్కడి రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీంతో రాకపోకలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. పశ్చిమ బైపాస్‌తో అమరావతికి యాక్సెస్ మెరుగుపడింది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు పూర్తయ్యాక మరింత అభివృద్ధి జరుగుతుంది’’ అని చంద్రబాబు వివరించారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడుతూ… ‘‘హార్టీకల్చర్ హబ్‌కు రూ.30 వేల కోట్లు కేటాయించడం మంచి నిర్ణయమన్నారు.
ఒకప్పుడు రాయలసీమలో పశువులకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉండేది. 2014-19 కాలంలో రెయిన్ గన్స్‌తో పంటలను కాపాడాల్సి వచ్చింది. అప్పుడే హంద్రీనీవా ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకున్నాం. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చింది మా ప్రభుత్వమే. దేశంలోనే నాణ్యమైన పండ్లు ఇప్పుడు రాయలసీమ నుంచే వస్తున్నాయి. ఇక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది’’ అని సీఎం అన్నారు.
ఎమ్మెల్యేలు గతంలో ఉన్నట్లు ఉంటానని ఎమ్మెల్యేలు మారకపోతే వాళ్లకే ముఖ్యమంత్రి హెచ్చరించారు. 9 పారామీటర్లపై సర్వే చేయించి నివేదిక ఇస్తున్నాం..అది ఎమ్మెల్యేల పనితీరుకు నిలువుటద్దం..వారికి తెలియని ఇంకొన్ని పారామీటర్లు కూడా నా వద్ద ఉన్నాయని తెలిపారు. మంగళగిరి చీరలకు లోకేశ్ మంచి బ్రాండింగ్ తీసుకొస్తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ మహిళా సభ్యులు ఒకేరకమైన చీరలతో సభకు రావడం వారి ఐక్యతకు నిదర్శనమని తెలిపారు.






