హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

posted on: Feb 5, 2026 7:44PM

 

సీఎం చంద్రబాబుపై అనుచిత పదజాలం వాడి, పోలీసులపై ధ్వజమెత్తారన్న కేసుల్లో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురువారం  ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని  కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

అంబటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని రాంబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో ట్రయల్ కోర్టుతనకు రిమాండ్ విధించడాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై ఉన్న కేసులను కొట్టివేసి, ఊరట కల్పించాలని కోరారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...