ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఎర్రన్నాయుడు : సీఎం చంద్రబాబు
posted on Nov 2, 2025 12:20PM
.webp)
కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్బంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డడిగా, ఉన్నత విలువలకు ప్రతిరూపంగా, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన తెలుగుతేజం, నా ఆత్మీయ నేస్తం స్వర్గీయ కింజరాపు ఎర్రం నాయుడు వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నాను అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని మంత్రి లోకేశ్ అన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి ఎర్రన్నాయుడు అందించిన సేవలను స్మరించుకుందామన్నారు.