హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే : సుమన్

posted on: Oct 26, 2025 4:14PM

 

ఏపీలో సీఎం చంద్రబాబుపై సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు కార్యసాధకుడని, ఆయన దార్మనితతో, అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని సుమన్ పేర్కొన్నారు. దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు. 

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుమన్‌.. రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. గూగుల్‌ డేటా సెంటర్‌ తీసుకురావడం వల్ల నిరుద్యోగులకు భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...