Latest News

చంద్రబాబుపై ఏ ఆధారాలతో కేసులు మూసివేశారు.. ప్రభుత్వ వివరణకు హైకోర్టు ఆదేశాలు

posted on: Jan 20, 2026 1:37PM

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై  కేసులు మూసివేత పై  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ హయాంలో చంద్రబాబుపై నమోదైన రెండు కేసులను ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుపై కేసుల మూసివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో  పిటిషన్ దాఖలైంది. 

జగన్  హయాం లో చంద్రబాబు పై నమోదైన ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులు నమోదైన సంగతి తలిసిందే.  అయితే, కొద్ది రోజుల కిందట ఈ కేసుల్లో ఆరోపణలు వాస్తవం కాదంటూ ఏసీబీ కోర్టు కేసును మూసివేసింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను  కోర్టు కొట్టివేసింది.  

ఇప్పుడు హైకోర్టులో ఇదే తరహాలో పిటీషన్ దాఖలు కాగా.. విచారణ సమయంలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులు ఎందుకు మూసివేసారు.. ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ కోసం ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.   

google-ad-img
    Related Sigment News
    • Loading...