మేడ్చల్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడులు

posted on: Feb 6, 2026 3:46PM

 

మేడ్చల్‌ జిల్లా అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్ గడి మలక్‌పేట్ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నమాజీ మంత్రి మల్లారెడ్డి వాహనంపై  డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ అనుచరులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేశ్‌పైనా దాడికి దిగారు. 

మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా రెచ్చిపోయార. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. పాటల సౌండ్ తగ్గించాలని కాంగ్రెస్ నాయకులను కోరిన బీఆర్ఎస్ నేతలు కొరినట్లు తెలుస్తోంది.  సౌండ్ తగ్గించకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది.

దాడిలో లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన పరమేష్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా, దాడి చేయడమే కాకుండా కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ గుండాల దాడిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కారు అద్దం పగిలిపోయింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...