Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మరో ఉద్యమానికి కాక్రోచ్ లు రెడీ.. ఎందుకంటే?
posted on: Jul 29, 2026 11:14AM

కాక్రోచ్ జనతాపార్టీ మరో సారి ఉద్యమించడానికి రెడీ అవుతోంది. నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన మద్దతుకు దిగి వచ్చిన మోడీ సర్కార్.. ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. కాగా ఆ ఉద్యమ సమయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నమోదైన కేసులన్నిటినీ తక్షణమే ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. అయితే రోజులు గడుస్తున్నా కేంద్రం ఆ హామీని నెరవేర్చకపోవడంతో.. దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటమ్ ఇచ్చింది.
ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిథి సౌరవ్ దాస్.. నీట్ వివాదంపై నమోదైన ప్రజాహిత వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణ జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నారు. మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు కూడా శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్న సౌరవ్ దాస్, గతంలో ఎటువంటి నేరచరిత్ర లేని, నిర్బంధంలో ఉన్న విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. అయితే.. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లపై దర్యాప్తు అధికారులు విచారణ కొనసాగించవచ్చని కోర్టు పేర్కొన్న ఒకే ఒక్క అంశాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంటూ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆరోపించారు.
న్యాయస్థానం ఎక్కడా కేసులను ఎత్తివేయకూడదని ఆదేశించలేదని, నమోదైన కేసులను ఉపసంహరించుకునే పూర్తి అధికారాలు, చట్టపరమైన హక్కులు ప్రభుత్వానికి ఉంటాయని స్పష్టం చేశారు. నీట్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే కాకుండా, వారిపై మోపిన అక్రమ కేసులన్నింటినీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోతే.. మళ్లీ క్షేత్రస్థాయిలో వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
CJP to agitate again, Cockroach Janata Party, CJP ultimatum, student protest cases, FIR withdrawal demand, Supreme Court NEET ruling






