మహిళా రైతు తారవ్వకు పౌరసరఫరాల శాఖ అండ!

వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొను గోలు చేయా లని  గురువారం నాడు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రోదించిన తారవ్వ అనే మహిళకు పౌరసరఫరాల శాఖ అండగా నిలిచింది. మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు తన పంట మొత్తం వరద పాలైందని రోదిస్తూ తారవ్వ అనే మహిళా రైతు బుట్టతో కాలువలో పడిపోయిన వడ్డు తీస్తూ భోరున ఏడుస్తూ, వర్షాల నష్టాల పరిశీలనకు ఆ సమయంలో అక్కడకు వచ్చిన కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోవడానికి సంబంధించిన దృశ్యం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తారవ్వకు జరిగిన పంట నష్టంపై  సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. తారవ్వకు ఎటువంటి నష్టం కలగకుండా ఆమె పంటను కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై  సిద్దిపేటకు చెందిన  తారవ్వ పంట మొత్తాన్ని కొనుగోలు చేయ డమే కాకుండా 24 గంటల తిరగకుండా అందుకు సంబంధించిన సొమ్మును కూడా ఆమె ఖాతాలో డిపాజిట్ చేశారు.  అంతే కాక పౌర సరఫరాల సంస్థ తారవ్వ తోపాటు 106 మంది రైతుల పంటను సైతం కొనుగోలు చేశారు. 

ఈ సందర్భంగా తారవ్వ మాట్లాడుతూ... తన పంట నష్టపోయిం దంటూ నిన్న కలెక్టర్ కాళ్లు పట్టుకొని ఏడ్చిన తనతో పాటు రైతులందరికీ ప్రభుత్వం సహాయం చేసిందని.... ఈ సహాయం చేసిన కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఒకవైపు అల్లుడు చనిపోయాడన్న బాధ మరోవైపు వర్షాల కారణంగా దాన్యం మొత్తం నష్టపోయానన్న బాధ ఈ బాధలో ఉన్న తనను ప్రభుత్వం ఆదుకుందన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu