Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్న సివిల్ సర్వెంట్లు
posted on: Jan 24, 2026 2:38PM

పెళ్లంటే లక్షలు ఖర్చు చేసి, భారీ వేడుకలతో జరుపుకునే రోజులివి. కానీ అందుకు భిన్నంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారులు ఆదర్శప్రాయమైన వివాహం చేసుకున్నారు.
చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని అందరికీ సందేశం ఇచ్చారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని, కడప జిల్లా చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శేషాద్రిని రెడ్డి, ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఈ సరళమైన వివాహంతో సమాజానికి మంచి ఉదాహరణగా నిలిచారు. ఈ వివాహానికి పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.


.webp)



