Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రచయిత గణేష్ పాత్రో కన్నుమూత
posted on: Jan 5, 2015 9:21AM

ప్రముఖ నాటక, సినీ రచయిత గణేష్పాత్రో(69) చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడించారు. పావలా, ఒరేయ్ నాటికలతో గణేష్ పాత్రో రచయితగా ప్రసిద్ధి పొందారు. ఇటీవల విడుదలైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా రచయిత కూడా గణేష్పాత్రోనే. నిర్ణయం, సీతారామయ్య గారి మనువరాలు, రుద్రవీణ, మా పల్లెల్లో గోపాలుడు, ప్రేమించు పెళ్లాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మరో చరిత్ర, అత్తవారిల్లు లాంటి అనేక సినిమాలకు గణేష్ పాత్రో మాటల రచయిత. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన అన్ని చిత్రాలకు గణేష్ పాత్రోయే మాటల రచయిత. గణేష్ పాత్రోకి రెండుసార్లు నంది అవార్డులు వరించాయి. గణేష్పాత్రో స్వస్థలం విజయనగరం జిల్లా పార్వతీపురం.






