సైబర్ క్రైమ్ బ్యూరోలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

posted on: May 30, 2026 5:54PM

 

హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న సైబర్ క్రైమ్ బ్యూరో కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ బ్యూరోకు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మహేందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల ప్రకారం, ఓ కేసుకు సంబంధించిన వ్యవహారంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచంగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని సీఐ మహేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

అనంతరం ఆయన వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.ఈ ఘటనతో సైబర్ క్రైమ్ బ్యూరోలో కలకలం రేగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తుండగా, మహేందర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.ఈ ఘటనపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...