శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక అసలు కథ ఇదే? తెలిస్తే షాక్‌ అవుతారు?

చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక అసలు కారణమేంటి? నిజంగానే ఆయనకి దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందా? దళితులకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు? దాడులు జరిగినప్పుడు నోరు మెదపని శివప్రసాద్‌... ఇంత సడన్‌గా ఇప్పుడు కుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు? నిజంగా దళితులకు అన్యాయం జరుగుతుంటే, ఈ మూడేళ్లలో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు కులం గుర్తొచ్చింది? శివప్రసాద్‌ను ప్రతిపక్ష పార్టీ నేతలు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక ఉన్నది కుల సమీకరణాలా? లేక క్యాష్‌ ఈక్వేషన్సా?

 

అయితే శివప్రసాద్‌ ధిక్కార స్వరం వెనుక అసలు కథ క్యాస్ట్‌ కంటే క్యాషే కారణమనే టాక్‌ వినిపిస్తోంది. హాథీరాంజీ భూములను దళితులకు ఇవ్వాలన్న శివప్రసాద్‌ డిమాండ్‌ వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. ప్రభుత్వంపైనా..టీడీపీపైనా పెద్ద గొంతు వేసుకుని విరుచుకుపడే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేకి ఎర్రచందనమే ప్రధాన ఆదాయ వనరు. ఎర్రచందనం సాయంతో వారు కోట్లకు పడగలెత్తారు..అందుకే వారిద్దరికి ఆ పార్టీలో అంత ప్రాధాన్యత. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపారు. దీంతో స్మగ్లర్లు శేషాచలం వైపు రావడానికే భయపడుతున్నారు. దీంతో టీటీడీకీ చెందిన హాథీరాంజీ భూములపై కన్నెశారు. అయితే పవర్ వారి చేతిలో లేకపోవడంతో అధికార పక్షానికి చెందిన కీలక నేత అవసరం పడింది. అప్పుడు వారి దృష్టిలోకి వచ్చారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఆయనకు మొత్తం మేటర్ చెప్పి డీల్ కుదుర్చుకున్నారు. దళితుల పేరు చెప్పి ఆ భూములను చేజిక్కించుకునేందుకు పావులు కదిపారని జిల్లాలో చర్చ నడుస్తోంది. అయితే ఇంటెలిజెన్స్ ద్వారా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి..వారి ఎత్తులను చిత్తు చేశారు. ఈ విషయంలో సీరియస్‌గా ఉన్న సీఎం కనీసం ఆరు నెలలుగా శివప్రసాద్‌తో మాట్లాడలేదట.

 

అయితే తమ ప్లాన్‌ రివర్స్ కావడంతో సదరు నేతలు కులం కార్డ్‌ని పైకి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని..మంత్రివర్గ విస్తరణలో దళితులకు కనీస ప్రాధాన్యత దక్కలేదంటూ శివప్రసాద్ హైకమాండ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిని ఆయన చేత అనిపించింది ఆ ఇద్దరు నేతలేనని టాక్. వైసీపీ నేతలు శివప్రసాద్‌ని వెనకేసుకురావడం ఈ అనుమానాలను బలపర్చేలా ఉంది. ఎందుకంటే శివప్రసాద్‌ ఇష్యూ టీడీపీ అంతర్గత విషయం, అయితే శివప్రసాద్‌కేదో అన్యాయం జరిగిపోతున్నట్లు వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.