Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిత్తూరు మేయర్‌గా కటారి హేమలత
posted on: Apr 15, 2017 2:42PM

చిత్తూరు నగర మేయర్‌గా టీడీపీ అభ్యర్థి కటారి హేమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నిక కోసం నగరపాలక కార్యాలయంలో కలెక్టర్ సిద్ధార్ధజైన్ అధ్యక్షతన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ పదవికి 33వ డివిజన్ కార్పోరేటర్ కటారి హేమలత మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కౌన్సిల్ సభ్యులు ఆమెను నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఇంతకు ముందు మేయర్‌గా పని చేసిన కటారి అనురాధ దారుణ హత్యకు గురికావడంతో ఆమె స్థానంలో కొత్త మేయర్‌ను ఎన్నుకోవాల్సి వచ్చింది..ఈ నేపథ్యంలో ఆమె కోడలు హేమలత మేయర్‌గా ఎన్నికయ్యారు.


.jpg)



