అనుమతి లేకుండా చిరుఫొటోలు ఉపయోగిస్తే చర్యలు.. కోర్టు ఉత్తర్వులు
posted on Oct 27, 2025 10:03AM
.webp)
ఏఐ సాయంతో సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలతో సెబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకోవడానికి తెగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సెలబ్రటీల ప్రతిష్ఠకు కూడా భంగం కలిగిస్తున్నారు. ఏఐ పుణ్యమా అని ఏవి ఫేకో, ఏవి ఒరిజినలో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడటంతో సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఇదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు న్యాయ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవికోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వాయిస్ ఉపయోగించడాన్ని నిషేధించాలంటూ సిటీ సివల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో సిటీ సివిల్ కోర్టు చిరంజీవికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చిరు టీమ్ కీలక ప్రకటన విడుదల చేస్తూ.. చిరు అనుమతి లేకుండా ఆయన ఫొటోలు వాయిస్ ఉపయోగించడం, ఏఐ క్రియోషన్ వంటివి చేస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గతంలో ఓ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన విషయం తెలిసిందే... హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు అందుకు పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు కూడా. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు మరియు వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు... అంతటి తో ఆగకుండా వీటిని వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసి వైరల్ చేశారు. దీంతో చిరంజీవి అట్టి వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.