సోషల్ మీడియాలో ట్రోలింగ్.. మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మెగాస్టార్

సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ మెగాస్టార్ చిరంజీవి పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా తనను టార్గెట్ చేసి కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ చిరంజీవి స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం (అక్టోబర్ 29) ఉదయమే సైబర్ క్రైమ్ పీఎస్ కు చేరుకున్న చిరంజీవి... తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ ను ఆపాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదులో చిరంజీవి దయాచౌదరి అనే వ్యక్తి పేరు ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  కాగా ఇటీవలే చిరు తన ఫొటోలను డీప్ ఫేక్ చేసి అసభ్య, అశ్లీల వీడియోలను వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇదే విషయంపై ఆయన కోర్టును కూడా ఆశ్రయించడంతో.. కోర్టు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే.చ అంతలోనే సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ చిరంజీవి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu