సైబర్ నేరగాళ్లు చేతిలో చిక్కిన మెగాస్టార్ చిరంజీవి
posted on Oct 27, 2025 3:58PM
.webp)
గతంలో ఓ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన విషయం తెలిసిందే.. హీరోయిన్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కాడు. తన ప్రతిష్ట అంతా పోయింది అంటూ మెగాస్టార్ చిరంజీవి పోలీసులను ఆశ్రయించారు.
సినీ పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న మెగాస్టార్ డిప్ ఫేక్ బారిన పడ్డాడు. సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు మరియు వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు... అంతటి తో ఆగకుండా ఈ కేటుగాళ్లు మార్నింగ్ చేసిన అశ్లీల ఫోటోలు, వీడియోలను వెబ్సైట్లు, సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసి వైరల్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది గమనించిన మెగాస్టార్ చిరంజీవి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నా తన ప్రతిష్టను దెబ్బతీశారని.... అట్టి వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొ న్నారు. అంతేకాకుండా చిరంజీవి హైదరాబాద్ సిపి సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసా
గించారు.
చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
చిరంజీవి డీపీ ఫేక్ కేసులో విచారణ చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి యొక్క ఫోటోలు వీడియోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి అన్నారు. మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్ట్ చేస్తాం. ఇలాంటి డీపీ ఫేక్ సెలబ్రిటీలు కేసులు పెరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామన్నారు. అదే విధంగా చాదర్ ఘాట్ కాల్పుల కేసులో పురో గతి ఉంది. త్వరలో అన్ని వివరాలు వెల్లడి స్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు