Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐటీ నుంచి పెద్దల సభ వరకూ చింతకాలయ విజయ్ ప్రస్థానం
posted on: Jun 7, 2026 10:20AM

చింతకాయల విజయ్ అంటే కేవలం చింతకాలయ అయ్యన్న పాత్రుడు రాజకీయ వారసుడు మాత్రమే కాదు. ఉన్నత విద్యావంతుడు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి, రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. ఐటీ, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలపై ఆయనకున్న అవగాహన టెక్నాలజీని రాజకీయ వ్యూహాల్లోకి ఎలా అమలు చేయాలో నేర్పింది. ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది. ఆ సమయంలో టీడీపీ ఐటీ వింగ్, సోషల్ మీడియా విభాగాల బాధ్యతలను విజయ్ భుజానికెత్తుకున్నారు. పార్టీ కోసం ఒక పటిష్టమైన సోషల్ మీడియా ఆర్మీని అంటే టీడీపీ డిజిటల్ వింగ్ ను నిర్మించారు. కేవలం అమరావతి, హైదరాబాద్‌కే పరిమితం కాకుండా గ్రామ స్థాయి వరకు వాట్సాప్, ఎక్స్), ఫేస్బుక్ గ్రూపుల ద్వారా పార్టీ లూప్‌ను కనెక్ట్ చేశారు.
అప్పటి అధికార వైసీపీ ఐప్యాక్ టీమ్ సోషల్ మీడియాలో సంధించే విమర్శలను, ట్రోల్స్‌ను అంతే వేగంగా డిజిటల్ వేదికలపై తిప్పికొట్టడంలో విజయ్ వ్యూహాలు కీలకంగా పనిచేశాయి. 2019, 2024 మధ్య కాలంలో ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసినందుకు, పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించినందుకు విజయ్ తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లను, న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో జగన్ సర్కార్ విజయ్‌పై పలు కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం, విచారణల పేరుతో ఇబ్బంది పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ ఒత్తిళ్లకు లొంగకుండా ఆయన నిలబడటం, న్యాయపోరాటం చేయడం ద్వారా పార్టీ క్యాడర్లో ఆయనపై గౌరవం పెరిగింది. కేవలం ఏసీ రూముల్లో కూర్చునే నేత కాదనీ.. , పార్టీ కోసం కేసులు ఎదుర్కొనే ఫైటర్ అనీ తెలుగుదేశం క్యాడర్ గుర్తించింది. దీంతో యూత్ లో చింతకాలయ విజయ్ కు ఫాలోయింగ్ పెరిగింది.
ఇక విజయ్ తండ్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ కాలంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన బీసీ సామాజికవర్గ నేతగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉండటంతో ప్రత్యక్ష రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. ఉత్తరాంధ్రలో పార్టీ యువతను సమూహపరచడంలో విజయ్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్నిటికీ మించి చింతకాయల విజయ్ కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకో పరిమితమైన నాయకుడు కాదు. సాంకేతికతను, సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ డిజిటల్ క్యాడర్‌ను లీడ్ చేసిన అనుభవం ఆయనకుంది. అందువల్లే, నేటి ఆధునిక రాజకీయాల్లో, మారుతున్న ఢిల్లీ సమీకరణాలకు అనుగుణంగా ఇలాంటి టెక్-సావీ, అలాగే దూకుడుగా వ్యవహరించే యువనాయకుడిగా గుర్తించిన తెలుగుదేశం అధినాయత్వం చింతకాలయ విజయ్ ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించుకుంది.






