Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారత భూభాగంలోకి చైనా సైన్యం
posted on: Mar 12, 2016 10:52AM

భారత దేశంతో దూకుడుగా వ్యవహరించే చైనా సైన్యం కదలికలు మరోసారి ఉద్రిక్తలకు దారితీశాయి. గత మంగళవారం చైనా సైనికులు, జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలోకి కనీసం 6 కిలోమీటర్లు చొచ్చుకురావడంతో, భారత సైనికులు వారిని వెనక్కి పంపాల్సి వచ్చింది. ఈ సందర్భంలో ఎలాంటి కాల్పులూ చోటు చేసుకోకపోయినా, ఇరువర్గాల మధ్యా ఇంకా ఘర్షణ వాతావరణం నెలకొనే ఉంది. నిన్న మరోసారి చైనా సైన్యం లడఖ్‌లోకి దూసుకురావడంతో ఇవేవీ అనుకోకుండా జరిగిన ఘటనలుగా కనిపించడం లేదు. అయితే భారత సైన్యం మాత్రం ఈ విషయం మీద ఆచితూచి స్పందిస్తోంది. మంచు కరిగిపోయిన తరువాత, వేసవిలో సైనికులు విస్తృతంగా గస్తా కాస్తూ ఉంటారనీ... ఆ సందర్భంలో దారి తప్పే అవకాశం ఉందనీ చెబుతున్నారు అధికారులు. మరి చైనా సైనికులు దారి తప్పే వచ్చారా, కొత్త దారులు వెతుక్కుంటూ బయల్దేరారా అన్నది చూడాల్సిందే!


.jpg)
.jpg)


