అసలు ఎందుకొచ్చావ్ మిస్టర్ జి జిన్‌పింగ్?

posted on: Sep 20, 2014 10:49AM

 

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడు రోజులపాటు ఇండియాలో పర్యటించి వెళ్ళారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంతో ఆయన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళారు. ఆ ఒప్పందాలు ఎంతవరకు అమలవుతాయో లేదోగానీ, ఆయన గారి భారత పర్యటన పుణ్యమా అని దూరదర్శన్ యాంకర్ ఉద్యోగం పోయింది. చైనా నుంచి వచ్చిన అయ్యగారి పేరు జి జిన్‌పింగ్. ఇందులో జి అనే మాట XI అని వుంటుంది. ఆ మాటని సదరు యాంకర్ ‘ఎలెవన్’ జింగ్‌పింగ్ అని చదివింది. దాంతో దూరదర్శన్ అధికారులు సీరియస్‌ అయిపోయి ఆమెని ఉద్యోగంలోంచి తీసేశారు. జిన్‌పింగ్ పర్యటన వల్ల ఇండియాకి ఒరిగేదేంటో తెలియదుగానీ, ఒకరి ఉద్యోగం మాత్రం పోయింది.

 

అసలు జిన్‌పింగ్ ఏమైనా సూపర్ పాపులర్‌ నాయకుడా. ఆయనగారు మొన్న ఇండియాకి వచ్చేవరకూ ఆయన పేరు ఎంతమందికి తెలుసంట? జిన్‌పింగ్‌ అనడానికి బదులు జిన్‘పిగ్’ అంటే బాధపడాలిగానీ, తెలియక చేసిన పొరపాటుకి ఉద్యోగం తీసేసేంత శిక్ష దేనికంట? అయినా చైనావాళ్ళ పేర్లు మరీ విచిత్రం. ఒక పట్టాన అర్థమై చావవు. వాటిని ఎలా పలకాలో కూడా అర్థమేకాదు. అందరి పేర్లూ చింగ్‌చాంగ్ అన్నట్టే వుంటాయి. పైగా చైనావాళ్ళు వాళ్ళ పేర్లు కూడా విచిత్రమైన పద్ధతిలో పెడతారట. నామకరణం రోజున ఓ స్పూను నేలమీద విసిరేస్తారట. ఆ స్సూన్ ఎలాంటి సౌండ్ చేస్తే అలాంటి పేరు పెట్టేస్తారట. అలాంటి విచిత్రమైన ఆచారంతో పెట్టే పేర్లు విచిత్రంగా వుండక ఇంకెలా వుంటాయి? ఆ విచిత్రమైన పేరును పొరపాటుగా చదివిన పాపానికి ఒకరి ఉద్యోగమే పోగొట్టారే! అసలు చైనా పేర్లు ఇండియన్లకి తెలియాలని, నోరు తిరగాలని రూలేమైనా వుందా? ఒక్కసారి జింగ్‌పింగ్ ‌సార్ చేత ‘నరేంద్రమోడీ’ అనిపించండి.. ఎంత అందంగా పలుకుతాడో చూడండి. అసలు చైనావాళ్ళు ఏనాడైనా ఇతర దేశాల భాషలు మాట్లాడిన దాఖలాలు ఏవైనా వున్నాయా?

 

సరే, ఓ పెద్దమనిషి పొరుగు దేశం నుంచి మన ఇండియాకి వచ్చాడు. ‘జి’ అనేబదులు ‘ఎలెవన్’ అనడం వల్ల ఆయన గౌరవం పోయిందని అనుకుంటున్నారా? అయినా, ఆయన్ని అంత గౌరవించాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు. ప్రతిరోజూ సరిహద్దుల్లో చైనా సైనికులు దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తూనే వుంటారు. వారిని ఏనాడైనా ఈ పెద్దమనిషి ఆపిన దాఖలాలు వున్నాయా? చివరికి ఆయన ఇండియాలో పర్యటిస్తున్న రోజుల్లో కూడా సరిహద్దుల్లో దురాక్రమణకి ప్రయత్నించి కాల్పులు జరిపారు. అలాంటి దేశాధ్యక్షుడి పేరును తప్పుగా చదివారని ఒక యాంకర్ని బంగారం లాంటి ఉద్యోగంలోంచి తీసేశారు. అసలు ఈ జింగ్‌పింగ్ ఇండియాకి రాకుండా వుంటే ఒక ఉద్యోగి రోడ్డు మీద అయినా పడకుండా వుండేవారు. నాయనా జి జింగ్‌పింగ్ అసలు నువ్వు మా ఇండియాకి ఎందుకొచ్చావ్?

google-ad-img
    Related Sigment News
    • Loading...