చైనాలో అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం వారికి మాత్రమే..
posted on: Aug 24, 2020 12:36PM
కరోనా పుట్టిన చైనాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే దీని వినియోగంపై అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించింది. దీనిని కేవలం అత్యవసరంగా అవసమైన వారికి మాత్రమే వీటిని వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ వినియోగాన్ని జులై 22 నుండి ప్రారంభించినట్టు టీకా అభివృద్ధి బృందానికి నేతృత్వం వహిస్తున్న జెంగ్ జోంగ్‌వీ తెలిపారు. నిజానికి ఈ టీకాలు ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. ఆహార మార్కెట్లు, ట్రాఫిక్ వ్యవస్థ, సేవారంగాల్లో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యంగా వీటిని ఇస్తున్నట్టు జోంగ్‌వీ పేర్కొన్నారు. క్లినిక్ల ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ ను అత్యవసర సర్వీసులలో ఉన్నవారికి ఉపయోగించేందుకు చైనాలోని చట్టాలు అనుమతిస్తాయి. ఇది ఇలా ఉండగా సినోఫార్మ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో భాగంగా యుఎఇ లోని 20 వేల మందికి ఇచ్చినట్లుగా ఆ సంస్థ చైర్మన్ తెలిపారు.






