Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలానగర్‌లో లారీ కిందపడి చిన్నారి దుర్మరణం..!
posted on: Aug 2, 2026 5:23PM
.webp)
మామతో బైక్‌పై వెళ్లి లారీ కిందపడిన చిన్నారి..!
ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు.. ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వయసు కూడా రాలేదు. మామతో కలిసి బైక్‌పై సంతోషంగా వెళ్తున్న ఆ చిన్నారి.. ఊహించని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. క్షణకాలంలో జరిగిన ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మేడ్చల్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్–1లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పద్మనగర్ ఫేజ్–1కు చెందిన వేదశ్రీ (4) తన మామతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తోంది. మామతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా వెళ్తున్న చిన్నారికి అంతలోనే ఊహించని ప్రమాదం ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న లారీ సమీపంలోకి బైక్ రావడంతో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ టైర్ కింద పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి వేదశ్రీ లారీ చక్రాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది.
క్షణాల్లోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటివరకు మామతో కలిసి సంతోషంగా ప్రయాణించిన చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అక్కడి వాతావరణం విషాదంగా మారింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. వాటిని ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగింది? ద్విచక్ర వాహనం లారీ టైర్ కిందకు వెళ్లడానికి కారణమేంటి? ప్రమాద సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రహదారులపై వాహనాలు నడిపే సమయంలో మరిం
Child dies after being hit by lorry, Balanagar, Padmanagar Phase-1, Vedashree, Crime news, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police





