టెన్త్ పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి.. కర్నూలులో విషాదం

posted on: Mar 16, 2026 2:27PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుండి పదవ తరగతి పరీక్షలు  ప్రారంభ మయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలి రోజునే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. కర్నూలులోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ భాషా మరణించారు.

విధినిర్వహణలో ఉండగా ఆయన ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.   మృతుడి కుటుంబ సభ్యులకు అధికారులు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనతో పరీక్ష కేంద్రం వద్ద విషాద వాతావరణం నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...