Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ షర్ట్ కలర్ వెనుక "కలరింగ్" ఏంటీ..?
posted on: Jul 19, 2016 5:31PM

రాజకీయ నాయకులు ఎలాంటి చొక్కా వేసుకుంటారు...? ఛీ..అదేం ప్రశ్న ఆ మాత్రం తెలియదా..తెల్ల రంగు ఖద్దరు షర్ట్ వేసుకుంటారని చిన్నపిల్లల కూడా చెబుతారు. అయితే మనుషుల్ని రంగులుగా విడగొట్టి జాతులకు వర్ణాలని పేరు పెట్టిన మన సమాజంలో..రాజకీయ రంగంలో అసలు సిసలైన వర్ణ సంకరం జరుగుతోంది. మనుషులకు రంగులున్నట్లే పార్టీలు ఇప్పుడు సంకరింపబడుతున్నాయి. పార్టీ జెండాకు తగ్గట్టే చాలా మంది రాజకీయ నాయకులు తాము ధరించే షర్ట్ రంగును ఎంచుకుని పార్టీపై ఉన్న అభిమానాన్ని జనానికి చూపిస్తారు.
మనం రోజు కనిపించే దానికి భిన్నంగా కనిపిస్తే..ఏంట్రా స్పెషల్ అని మన రిలేటీవ్సో..స్నేహితులో ఆటపట్టిస్తారు. అలాంటిది ప్రముఖుల విషయంలో అలా జరిగితే దానికి ఎక్కడా లేని ఇంపార్టెన్స్ వచ్చేస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలోనూ అదే జరిగింది.
రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తెలుపు రంగు చొక్కాలో మాత్రమే కనిపిస్తారు. ఉద్యమ నాయకుడిగా ఉన్న కాలంలో తన పార్టీ జెండా గుర్తు అయిన గులాబీ రంగు చొక్కాలో కనిపించారు. అయితే రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశానికి హాజరైన తెలంగాణ సీఎం కొత్తగా కనిపించారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధరించే గోధుమ రంగు చొక్కా తరహాలో కాస్తంత లైట్ గోధుమ రంగు చొక్కాలో కేసీఆర్ దర్శనమిచ్చారు. గోధుమ రంగు గుడ్డతో కుట్టిన షర్ట్‌లో ఢిల్లీలోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్..ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయిన సమయంలో కూడా అదే రంగు చొక్కాలో దర్శనమిచ్చారు. ప్రజంట్ ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.






