Latest News

చికెన్ వ్యాపారుల నిరసన.. ఎల్బీనగర్‌లో ఉద్రిక్తత

posted on: Apr 1, 2026 12:25PM

హైదరాబాద్‌లో చికెన్ వ్యాపారులు నిరసన బాట పట్టారు. లాభాలు లేకపో వడం, పెరుగుతున్న ఖర్చులు, అప్పుల భారం పెరగడం కారణంగా చికెన్ దుకాణాల నిరవధిక బంద్ కు పిలుపునిచ్చిన వ్యాపారులు ఈ మేరకు  దుకాణాల ముందు బ్యానర్లు ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మేత ధరలు, రవాణా ఖర్చులు, కార్మిక వ్యయం పెరగడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితు ల్లో చాలా మంది చికెన్ వ్యాపారులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యం లోనే ఏప్రిల్ 1, 2026 నుంచి తమ దుకాణాలను తాత్కా లికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యా ప్తంగా ఈరోజు ఉదయం నుండి చికెన్ సెంటర్ల బంద్ కొనసాగు తోంది. కాగా  ఎల్బీనగర్‌లోని ఓ చికెన్ అవుట్‌లెట్ యజమాని   షాప్ తెరిచి   విక్రయాలు  సాగిస్తున్న విషయం తెలుసుకున్న చికెన్ దుకాణాల అసోసియేషన్  సభ్యులు  అక్కడకు చేరుకుని  రాష్ట్రవ్యాప్త  బంద్ కొనసాగుతున్నది షాప్ మూసేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఆ షాప్ యజమాని వారితో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ పాష్ లో ఉన్న కోడిగుడ్ల ట్రేలను అసోసియేషన్ సభ్యులు బయటకు విసిరేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపులోనికి తీసుకువచ్చారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...