చత్తీస్‌గఢ్‌లో 21 మంది మవోల లోంగుబాటు
posted on Oct 26, 2025 5:31PM

చత్తీస్‌గఢ్ కేష్కల్ డివిజన్‌లోని కిస్కోడో ఏరియా కమిటీకి చెందిన సెక్రటరీ ముకేశ్ సహా 21 మంది మావోయిస్టులు లోంగి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో 13 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. లొంగుబాటు సమయంలో 18 ఆయుధాలను మావోలు పోలీసులకు అప్పగించారు. ఆపరేషన్ కగార్‌తో భారీగా ఎత్తున మావోలు లొంగిపోయిన విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలైట్ రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే.
లొంగిపోయిన వారిలో కేశ్‌కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, నలుగురు డీవీసీఎంలు (డివిజన్ వైస్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఏఎంసీ (ఏరియా కమిటీ సభ్యులు)లతో పాటు ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
బస్తర్‌రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పీ సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. మావోయిస్టులు తాము అనుసరిస్తున్న మార్గం వ్యర్థమని భావించి.. వారి జీవితాలను పునర్నిర్మించుకునేందుకు జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని ఎంచుకున్నారన్నారు. ఆయుధాలను విడిచిపెట్టిన 21 మందిలో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారన్నారు. వారంతా సాయుధ పోరాటాన్ని వీడి శాంతి, పురోగతి మార్గంలో వెళ్లాలనుకుంటున్నారని పోలీస్ అధికారి పేర్కొన్నారు.