Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హీరో ఆర్యపై చీటింగ్ కేసు నమోదు..!
posted on: Jul 12, 2026 12:47PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది. షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్న సినీ పరికరాలకు సంబంధించిన రూ.1.80 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన తాహేర్ సినీ టెక్నిక్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఆర్య హీరోగా నటిస్తున్న 'అనంతన్ కాడు' చిత్రీకరణ కోసం గత ఏడాది ఫిబ్రవరిలో డిజిటల్ కెమె రాలు, లైటింగ్ యూనిట్లు సహా అత్యాధునిక షూటింగ్ సామగ్రిని తాహేర్ సినీ టెక్నిక్ సంస్థ నుంచి అద్దెకు తీసుకున్నారు. ఈ పరికరాలను హైదరాబాద్ నుంచి కేరళలో జరుగుతున్న షూటింగ్‌కు సంస్థ స్వంత ఖర్చులతో తరలించినట్లు పేర్కొన్నారు.
మొత్తం అద్దె బిల్లు రూ.2.12 కోట్లు కాగా, అందులో రూ.1.80 కోట్లకు పైగా బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని సంస్థ ఆరోపించింది. సినిమా విడుదలకు ముందే బకాయిలన్నీ చెల్లించి 'నో డ్యూస్ సర్టిఫికేట్' తీసుకుంటామని నిర్మాత వినోద్, నటుడు ఆర్య లిఖితపూర్వ కంగా హామీ ఇచ్చినా, ఆ హామీని నిలబెట్టుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకాయిల కోసం పలుమార్లు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా సంప్రదించినా స్పందించలేదని, డబ్బులు అడిగిన తమ సంస్థ మేనేజర్‌ను ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. బాధిత సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా, ఆర్య లేదా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఈ ఆరోపణలపై అధికారిక స్పందన వెలువడలేదు.



.webp)


