Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీ, అసోంలో చంద్రబాబు పర్యటన
posted on: May 11, 2026 12:49PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ, అసోంలలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఇక సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్‌లో సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక తరువాత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ఆయన భేటీ అవుతారు. రాత్రి హస్తినలోనే బస చేస్తారు. ఇక మంగళవారం (మే 12) ఉదయం హస్తిన నుంచి నేరుగా అసోం రాజధాని గువాహటికి వెళ్తారు. అక్కడ అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు అమరావతికి తిరిగి వస్తారు.



.webp)


