పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బాబు దావోస్ పర్యటన
posted on: Jan 20, 2015 8:09AM
.jpg)
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో హాజరయ్యేందుకు ఈరోజు ఆయన బయలుదేరి వెళ్ళారు. ఆ సదస్సులో ఆయన పట్టణాభివృద్ధి భవితవ్యం అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ఆ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అనేక ప్రముఖ సంస్థల సి.ఈ.ఓ.లతో ఆయన సమావేశమయ్యి తన ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీల గురించి వివరించి వారిని రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టమని కోరనున్నారు. డేవిడ్ చీస్ రైట్ (వాల్ మార్ట్); ఇంద్రా నూయూ (పెప్సీ కంపెనీ); విశాల్ సిక్కా (ఇన్ఫోసిస్); ఫ్రాన్స్ వన్ హౌటన్ (రాయల్ ఫిలిప్స్); ఉషారావు (గ్లోబల్ వాటర్ డెవెలప్మెంట్ పార్ట్ నర్స్); రిషాద్ ప్రేమ్ జీ (విప్రో) తదితర సంస్థల సంస్థల సీఈఓలను చంద్రబాబు నాయుడు కలుస్తారు. చంద్రబాబు నాయుడు తన ప్రతీ విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షిస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన అనేక ప్రముఖ సంస్థల సీఈఓలతో ముఖాముఖి సమావేశం అవుతున్నారు కనుక ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తారని ఆశించవచ్చును.
ఆయనతోబాటు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన రావు, ఇంధన మరియు మౌలికవసతుల కల్పన శాఖల ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మరి కొంతమంది ఉన్నతాధికారులు దావోస్ వెళ్ళారు.



.jpg)


.webp)



