Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాబు విజన్ కు దక్షిణాది సీఎంలు ఫిదా.!
posted on: Aug 20, 2026 2:38PM

దక్షిణాది రాష్ట్రాల సమగ్ర వికాసం, ఆర్థిక పురోగతి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన కార్యాచరణ ప్రణాళికు విశేష స్పందన లభించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడు మహాబలిపురంలో నిర్వహించిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో నారా చంద్రబాబు దక్షిణాది ప్రగతికి అవసరమైన సమగ్ర ప్రణాళికలను స్పష్టమైన బ్లూప్రింట్ రూపంలో సభ ముందుంచారు.
ఈ కీలక సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు ప్రతిపాదించారు.
అలాగే.. అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య సమగ్ర లాజిస్టిక్స్ నెట్‌వర్క్ నిర్మించాలని సూచించారు. జాతీయ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా కీలకమని గుర్తు చేస్తూ, వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారంలో దక్షిణాది కీలకమని ఉద్ఘాటించారు. ఆధ్యాత్మిక రంగాన్ని ప్రోత్సహించేందుకు తిరుపతి కేంద్రంగా కాశీ, అయోధ్య, చార్‌ధామ్ ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ రూపొందించాలని చంద్రబాబు ప్రతిపాదించారు.
అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో కీలక సూచనలు చేశారు. ఈ అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీల నీటిని మళ్లించవచ్చని, ఇది తమిళనాడు తాగు, సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారంగా మారుతుందన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉమ్మడి సమన్వయంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దుగ్గరాజుపట్నం వద్ద పోర్టు, వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు.
సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యక్తంచేసిన సమగ్ర విజన్, ప్రాంతీయ సహకార ఆలోచనలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడిగా ఆయన కేవలం ఒక్క రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది ప్రగతిని కాంక్షిస్తూ విస్తృత దృక్పథంతో మాట్లాడారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రస్తుతించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఆర్థిక, మౌలిక వసతుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్వహించిన ఈ కౌన్సిల్ భేటీతో రాబోయే రోజుల్లో ప్రాంతీయ సమస్యల పరిష్కారం వేగం పుంజుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
Chandrababu Naidu, Southern Zonal Council, Bullet Train Corridor, Godavari Cauvery Linking, Telugu News, TeluguOne






