అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన చంద్రబాబు

posted on: Jun 21, 2026 8:17AM

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిన్నారులతో మమేకమయ్యారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా  లింగంగుంట్ల గ్రామంలో  అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన,అక్కడి చిన్నపిల్లలతో  సమానంగా కింద నేలపై కూర్చుని, వారితో కలిసి  రాగి జావ  సేవించారు.  స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ తదితర   కార్యక్రమాల్లో పాల్గొనేందుకు  పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు తన పర్యటనను అంగన్ వాడీ కేంద్ర సందర్శనతోనే ప్రారంభించారు. ఆ అంగన్వాడీ  కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై  ఆరా తీశారు.

కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను  పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు.  పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.

ఈ పర్యటనలో నెట్ జీరో పర్యావరణ విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సంపూర్ణ కాలుష్యరహితంగా మార్చాలనే సంకల్పంతో  ప్రవేశపెట్టిన ఈ విధానంలో భాగంగా  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు  ఆధునిక ఇండక్షన్ స్టవ్‌లతో పాటు స కొత్త స్టీల్ పాత్రలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన  లింగంగుంట్ల అంగన్ వాడీ కేంద్రానికి వీటికి  స్వయంగా అందజేశారు.  

ఇక  రైతాంగానికి మేలు చేకూర్చే  అన్నదాత సుఖీభవ  పథకం ద్వారా..  2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొదటి విడత పెట్టుబడి సహాయాన్ని  బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా   46.85 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా  3,125 కోట్ల రూపాయలను జమచేశారు.  

ఈ పర్యటనలో భాగంగానే ప్రకృతి సేద్యం, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్న స్థానిక రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...