Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పూనమ్ దగ్గర పెన్‌డ్రైవ్‌లు... చంద్రబాబు అపాయింట్‌మెంట్
posted on: Apr 3, 2018 11:41AM

ఇప్పుడున్న ట్విస్ట్ లు చాలవన్నట్టు ఏపీ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో.. ఇక్కడ రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండటానికి రకరకాల డ్రామాలాడుతుంది. దీంతో ఇదంతా వర్కవుట్ కాదులే అనుకొని ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఢిల్లీ వెళ్లారు. అక్కడ వివిధ పార్టీల నేతలతో భేటీ అయి.. ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాలను అన్ని పార్టీల నేతలకు అందజేసి... ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు.
ఇదంతా ఒకఎత్తైతే ఇప్పుడు మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును సినిమా నటి 'పూనమ్‌కౌర్' కలుసుకోబోతోందని...ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇటీవల పవన్, కత్తి మహశ్ వివాదంలో పూనమ్ కౌర్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కత్తి మహేశ్ పూనమ్ కౌర్ గురించి..ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలగురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక సినిమా నటుడు, పార్టీ అధ్యక్షుడికి ఆమెకు మధ్య సంబంధం ఉందని...ఆమెను అతను మోసం చేశాడని 'కత్తి' ఆరోపించారు. ఈ వివాదంపై అప్పట్లో...పూనమ్‌కౌర్ కూడా స్పందించి ట్విట్టర్‌లో కొన్ని వ్యాఖ్యలు చేసి...తరువాత డిలీట్ చేసింది. ఆ తరువాత ఏమైందో కానీ... అప్పటివరకూ మద్దతుగా నిలిచిన ఆమె.. పరోక్షంగా సినిమానటుడు, పార్టీ అధ్యక్షుడుపై విమర్శలు గుప్పిస్తోంది. 'కాన్సెప్ట్‌లు కాపీ...చేసి...బట్టలు మార్చినట్టూ...మాటపై నిలబడకుండా...జనాలను అమాయకులను చేస్తూ...అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటూ...రాజకీయాలు చేస్తోన్న వారి గురించి భగవంతుడే నిజా నిజాలు తెలియజేయాలని కోరుకుంటున్నా...' అంటూ ఇటీవల ఆమె ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె చంద్రబాబును కలవడానికి గల కారణం ఏంటబ్బా అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఇదే సందర్భంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ నటుడు గురించి చెప్పడానికే పూనమ్ చంద్రబాబును కలవనున్నారని అంటున్నారు. తనను మోసం చేసిన నటుడుపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె చంద్రబాబునాయుడును కోరనున్నారట. ఇప్పటికే ఆమె సిఎం అపాయింట్‌మెంట్ అడిగారని...ఆమెకు 4వ తేదీన ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరికిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తనను మోసం చేసిన వ్యక్తి గురించి..అందరికీ తెలుసునని..ఆ వ్యక్తి వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లు..తన వద్ద కూడా ఉన్నాయని..వాటిని సిఎంకు అందజేస్తానని ఆమె చెబుతున్నారట. ఒక వేళ ఆమె కనుక సిఎంను కలసి..పెన్‌డ్రైవ్‌లు ఇస్తే...రాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు తిరుగుతాయని...రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు స్ట్రైక్ అయి ఉండొచ్చు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.





