Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రానికి భారీ రుణం సంపాదించిన చంద్రబాబు
posted on: Jun 28, 2014 9:25PM
.jpg)
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యదక్షతను మరొకమారు నిరూపించుకొన్నారు. మొన్న డిల్లీ వెళ్లి, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రితో సమావేశమయిన చంద్రబాబు కేంద్రం నుండి రాష్ట్రంలో వివిధ విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ. 18, 268 కోట్లు భారీ రుణం సంపాదించగలిగారు. ఆ మొత్తంలో విజయవాడ వద్ద గల యన్.టీ.టీ.పీ.యస్ (800 మెగా వాట్స్) నాలుగవ దశ విస్తరణ పనులకు రూ. 5286 కోట్లు, క్రిష్ణపట్నం వద్దగల డీ.యస్.టీ.పీ.పీ.విద్యుత్ ఉత్పత్తి సంస్థ (800 మెగా వాట్స్) రెండవ దశ విస్తరణ పనులకు రూ. 5140 కోట్లు, రాష్ట్ర గ్రామీణ విద్యుత్ కార్పోరేషన్ కు రూ. 4300 కోట్లు, రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు రూ. 3542 కోట్లు రుణాలు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఇదిగాక ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు కోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానే ఎంపికచేసినందున, త్వరలోనే దానిని రాష్ట్రంలో అమలు చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఇక రైల్వే వేగన్ల కొరత కారణంగా సకాలంలో బొగ్గు సరఫరా జరగక రాష్ట్రంలో పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, అధనంగా మరికొన్ని రైల్వే వేగన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ అంగీకరించారు. అయితే ఇంకా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధుల కేటాయింపు, రాష్ట్ర ఆర్ధికలోటును పూడ్చేందుకు బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు, ఉన్నత విద్యా, వైద్య సంస్థల మంజూరు వంటివి అనేకం సాధించవలసి ఉంది.



(8).jpg)


