శాఖల కేటాయింపుకు ముందే మంత్రులకు బాబు క్లాసు
posted on: Jun 11, 2014 6:41PM
(1).jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు కూడా మోడీనే ఆదర్శంగా తీసుకొని పని ప్రారంభించారు. మంత్రులకు పోర్ట్ ఫోలియోలు కేటాయించక ముందే ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యి శాఖలు ఏవయినప్పటికీ మంత్రులందరూ తప్పనిసరిగా ఐకమత్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకొంటూ రాష్ట్రాభివృద్ధికి గట్టిగా కృషి చేయాలని, ముటాలు, గ్రూపు రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ముందే అందరికీ హెచ్చరికలు జారీ చేసారు. మూడు నెలల తరువాత వారి పని మంచి పనితీరు స్వయంగా సమీక్షిస్తానని , సంతృప్తికరంగా లేకపోయినా మంత్రివర్గంలో నుండి ఉద్వాసన తప్పదని ముందే హెచ్చరించారు.
మంత్రులకి పోర్ట్ ఫోలియోలు కేటాయించక ముందే చంద్రబాబు అందరికీ గట్టిగా క్లాసు తీసుకోవడంవలన, ఎవరూ కూడా ఇంతవరకు తమకు అప్రదాన్యమయిన శాఖలు ఇచ్చేరని అలిగి కూర్చోన్నట్లు వార్తలు రాలేదు. ఎవరయినా అలిగినట్లయితే బహుశః వారిని ఆ పదవి నుండి తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇటీవల చంద్రబాబు నాయుడు తెలంగాణా అసెంబ్లీకి తెదేపా శాసనసభాపక్ష చైర్మన్ గా ఎర్రబెల్లి దయాకర్ రావుని, శాసనసభ ఫ్లోర్ లీడర్ గా తలసాని యాదవ్ ను నియమిద్దామనుకొన్నపుడు, తలసాని యాదవ్ తనకు శాసనసభాపక్ష నాయకుడిగా నియమించనందుకు అలిగి, తనకు ఎటువంటి పదవులు వద్దని శాసనసభ్యుడుగానే కొనసాగుతానని ప్రకటించడంతో, చంద్రబాబు ఆయనను పక్కన పెట్టేసారు.
అందువల్ల ఇప్పుడు అప్రదాన్య శాఖలను ఇచ్చినందుకు అలిగితే తమకు అదే పరిస్థితి ఎదురవుతుందని మంత్రులందరిలో ఒకరకమయిన భయం ఏర్పడింది. గ్రూపు రాజకీయాలు నడపడంలో అందెవేసిన గంట శ్రీనివాస రావు బహుశః అందుకే తనను వ్యతిరేఖించే విశాఖజిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడుతో కలిసిపని చేస్తానని చెప్పారు.



.jpg)
.jpg)

.webp)



