Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలయ్యకు కూడా బాబు హ్యాండ్?
posted on: Apr 10, 2014 4:18PM
.jpg)
తెదేపాలో సీనియర్ నేత రేవంత్ రెడ్డి పరిస్థితి చూసిన తరువాత, ఇంకా టికెట్ దొరకని సీమాంధ్ర తెదేపా నేతల గుండెల్లో కూడా రైళ్ళు పరిగెడుతున్నాయి. చంద్రబాబుకి స్వయాన్న వియ్యంకుడయిన బాలకృష్ణ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనబడటం లేదు.
“బాలయ్య లోక్ సభకు పోటీ చేస్తారో లేకపోతే శాసనసభలే పోటీ చేస్తారో, ఎక్కడి నుండి పోటీ చేస్తారో అంతా ఆయనిష్టం. ఆయన ఎక్కడి నుండి దేనికి పోటీ చేయాలనుకొన్నా నాకెటువంటి అభ్యంతరమూ లేదు,” నిన్న మొన్నటి వరకు చెపుతూ వచ్చిన చంద్రబాబు, మొన్న విడుదల చేసిన మొదటి జాబితాలో బాలకృష్ణ పేరు లేకపోవడంతో మీడియా అదే ప్రశ్న లేవనెత్తినపుడు, “ఈవిషయమై బాలయ్యతో చర్చించవలసి ఉంది. ఆయనతో చర్చిన తరువాత నిర్ణయం తీసుకొంటాము” అని చెప్పడం గమనిస్తే, బాలయ్యకు కూడా చంద్రబాబు హ్యాండ్ ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కానీ, ఆయన పోటీ చేయాలనుకొంటున్న హిందూపురం నియోజక వర్గానికి వేరే ఏ అభ్యర్ధిని మొదటి జాబితాలో ప్రకటించకపోవడం చూస్తే ఇంకా బాలయ్యకు అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. కానీ ఈసారి కూడా ఆయనను ప్రచారానికే వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిజమనుకొంటే, బాలయ్యను ప్రచారానికి ఒప్పించగలిగితే ఆ సీటుని వేరొకరికి లేకుంటే ఆయనకే కేటాయించేందుకు ఆలోచిస్తున్నారేమో అనుకోవలసి ఉంటుంది!
సీమాంద్రాలో కూడా నామినేషన్లు వేయడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమె మిగిలి ఉంది గనుక ఈలోగా ఒకరి స్పందన మరొకరు చూసిన తరువాతనే ఈ విషయంపై మాట్లాడుకోవచ్చని భావిస్తున్నట్లున్నారు. అందుకే ఇద్దరూ బయటపడకుండా ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని చెపుతున్నారు. ఏమయినప్పటికీ, మరొక రెండు రోజుల్లో లిజండ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారో లేదో స్పష్టమయిపోతుంది.


.jpg)



