జూలు విదిల్చిన చంద్రబాబు
posted on: Jun 10, 2015 10:56PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి తెలిసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చాలామంది గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన ఆయన పదేళ్ళ ప్రతిపక్షానుభవం తర్వాత కొంత మారారు. తన క్రమశిక్షణను కొంత సడలించుకున్నారు. గతంలో ఎలాంటివారితో అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వ్యవహరించే ఆయన చాలా ఓర్పును అలవరుచుకున్నారు. ఎదుటివారిలో భారీగా లోపాలు వున్నాయని తెలిసినప్పటికీ, గతంలో మాదిరిగా వారికి పనిష్మెంట్ విధించడం కాకుండా ఓర్పుగా వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన తన ఓర్పును ప్రదర్శిస్తూనే వున్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి వ్యవహార శైలికి, ఇప్పటి వ్యవహార శైలికి స్పష్టమైన తేడాను అందరూ గమనిస్తున్నారు.
అయితే సింహం గర్జించకుండా, జూలు విదల్చకుండా, పంజా విసరకుండా ఓర్పు వహిస్తూ వుంటే దారిన పోయే ఎలుక కూడా ఆ సింహం మీసాలతో ఆడుకుంటుంది. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు విషయంలో కూడా కొందరు అలాగే వ్యవహరిస్తూ వచ్చారు. తెలుగు ప్రజల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు సహనంగా వుంటూ వస్తే, ఆ సహనాన్ని అసమర్థతగా భావించి ఆయనతో ‘గేమ్స్’ ఆడే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడిలో మార్పు తెచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన మళ్ళీ జూలు విదిల్చినట్టే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట తీరులోగానీ, వ్యవహార శైలిలోగానీ, ముఖంలోగానీ మునుపటి సీరియస్‌నెస్ కనిపిస్తోంది. ‘‘నన్ను తక్కువ అంచనా వేశారు కదూ... మీ సంగతి తేలుస్తా’’ అనే హెచ్చరిక ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడాయన జూలు విదిల్చిన సింహంలా వున్నారు. మరి ఆయన పంజా వేటు పరిణామాలు ఎలా వుంటాయో వేచి చూడాలి.



.jpg)


.webp)


