డీజీపీ ఎదుట లొంగిపోయిన చంద్రన్న

 

మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చందన్న పోలీసుల ముందు లొంగిపోయారు. చంద్రన్నది పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్, సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతోనే వారు జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. బండి ప్రకాశ్‌‌పై ఉన్న రూ. 20లక్షల రివార్డు, ప్రసాద్‌రావుపై ఉన్న రూ.25 లక్షల రివార్డు వారికే ఇస్తామని తెలిపారు. 

ఇంక 64 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడించారు. మాంచేరియాల్ జిల్లా మందమార్రీ మండలం పోచమ్మ దేవాలయం ప్రాంతానికి చెందిన బండి ప్రకాష్ విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరారు.1980 దశకంలో “గ్రామాలకు వెళ్ళిపోవాలి” అనే విప్లవ ప్రచార ఉద్యమం సమయంలో ఆయన ఆక్టివ్‌గా ఉన్నారు.

 తరువాత సింగరేణి ప్రాంతంలో శ్రమికుల సమస్యలపై పోరాటాలు నడిపి, సింగరేణి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడి నుంచే మావోయిస్టు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సీపీఐ మావోయిస్టు పార్టీ  తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఆయన పార్టీకి చెందిన నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్‌గా పనిచేసి, దక్షిణ తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను సమన్వయం చేశారు. తన సుదీర్ఘ ఉద్యమ జీవితం కారణంగా ఆయన్ని “తెలంగాణ మావోయిస్టుల ఆలోచనాత్మక నేత”గా మిత్రులు, విప్లవ వర్గాలు గుర్తించాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu