చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి
posted on: Feb 18, 2026 7:37PM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసులో అరెస్టై చంచలగూడ జైల్లో గత 90 రోజులుగా ఉన్న ఇమ్మడి రవికి నిన్నహైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా ఇవాళ విడుదల అయ్యాడు.ఈ కేసులో కోర్టు మొత్తం 12 కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేయడం అత్యంత ప్రాధాన్యం సంత రించుకుంది. ముఖ్యంగా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టంగా ఆదేశించింది. రవిని కరేబియన్ దీవుల పౌరుడిగా కోర్టు గుర్తించి నట్లు న్యాయవాది పేర్కొ న్నారు. విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పాస్ పోర్ట్ వినియోగంపై కూడా పరిమితులు విధించినట్లు న్యాయవాది గోపీంద్రనాథ్ తెలిపారు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణ కు పూర్తి సహకారం అందించాలని, ఎటువంటి సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియా అకౌంట్ల వినియోగంపైన కూడా కోర్టు పూర్తిగా నిషేధం విధించింది. ఇంటర్నెట్, విపిఎన్ వినియోగించరాదని కోర్టు కఠినంగా చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాల్సి వస్తే పోలీసుల అనుమతి తప్పనిసరి సరిగా తీసుకుని, వారి సమక్షంలోనే వినియో గించాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది.
ఐబొమ్మ యాప్‌కు సంబంధించిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం విధితమే... కాపీరైట్ ఉల్లంఘనలు, అక్రమ స్ట్రీమింగ్ వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు కాగా, కీలకంగా భావించిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన చెంచలగూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఐబొమ్మ రవిని బెయిల్ మంజూరుతో ఈ కేసులో కొత్త మలుపు తిరిగినట్లైంది.
కోర్టు విధించిన కఠిన షరతుల కారణంగా రవి ప్రతి కదలికపై పోలీసుల పర్యవేక్షణ కొనసాగనుంది. దర్యాప్తు సంస్థలు సాంకేతిక ఆధారాలను సేకరించే పని లో ఉన్నట్లు తెలిసింది. విచా రణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.బెయిల్ లభించినప్పటికీ కేసు విచారణ ఇంకా కొనసా గుతుండటంతో ఈ వ్యవహా రం తదుపరి రోజుల్లో మరింత ప్రాధాన్యం సంత రించుకునే అవకాశముంది. ఐబొమ్మ కేసులో కొత్త పరి ణామాలపై సినీ, సాంకేతిక వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది.






