Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Podharillu: మహా ఇంట్లో పూజ చేయడంతో కన్నా ఎమోషనల్.. అన్నదమ్ములు షాక్!
posted on: Feb 19, 2026 12:34PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు(Podharillu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 53 లో.. మహా బాధపడుతుంటే చక్రి వస్తాడు. మనం అలా బయట తిరిగేసి వద్దాం.. నీ మూడ్ మారుద్ది అని చక్రి అంటాడు. ఇక మహాని తీసుకెళ్ళి సిటీ అంతా తిరుగుతాడు చక్రి. ఇక అంతా తిరిగాక మహా మూడ్ మారుతుంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో చక్రి కేశవ, కన్నా అందరు పడుకొని ఉంటారు.
అప్పుడే మాధవ దగ్గరికి మహా వచ్చి.. ఏంటి తమ్ముళ్ళని అలా పెంచుతున్నావంటూ తిడుతుంది. పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేయాలి కదా అంటు అందరి మీద నీళ్ళు చల్లి లేపుతుంది మహా. ఇక చక్రి , కేశవ, కన్నా భయపడుతూ లేస్తారు. ఇక ఇంటిముందు కల్లాపి చల్లి ముగ్గు వేస్తుంది మహా. దానికి అందరు క్లాప్స్ కొడతారు. దాంతో మహా మురిసిపోతుంది. కాసేపటికి మహా స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టడానికి వస్తుంది. అక్కడ దేవుడి ఫోటోల దగ్గర అన్నీ పాతబడిపోయి ఉంటాయి. వాటిని తీసుకొని చక్రికి ఇచ్చి క్లీన్ చేసుకురమ్మంటుంది మహా. మాధవ మధ్యలో కలుగజేసుకొని నేను చేస్తాననని అంటాడు. వద్దు.. వాళ్ళకి కూడా పని రావాలని అంటుంది. కేశవ పూలు తీసుకొని వస్తాడు. కన్నా , చక్రి ఇద్దరు అవి క్లీన్ చేసుకొస్తారు. ఇక మహా పూజ చేస్తుంది. ఇల్లంతా సామ్రానీ వేస్తుంది. కేశవ, కన్నా, మాధవలకి బొట్టు పెట్టి ప్రసాదం పెడుతుంది మహా. ఇక అదంతా చూసి కన్నా ఎమోషనల్ అవుతాడు. ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరు.. మీరొచ్చాక ఇంట్లో దీపం వెలిగింది.. మా ఇంటికి వెలుగొచ్చిందంటూ కన్నా ఎమోషనల్ అవుతాడు. దాంతో అందరు కలిసి ఓదారుస్తారు.
ఇక మాధవ టీ పెడుతుంటే మహా వచ్చి నేను పెడతానంటూ వస్తుంది. అందరు వద్దని చెప్పినా వినకుండా టీ పెడుతుంది. అది కన్నా, మాధవ, కేశవ, చక్రిలతో పాటు వాళ్ళ నాన్న నారాయణకి కూడా ఇస్తుంది. ఇక నారాయణ తాగుతూ అప్పుడే టేప్ రికార్డర్ లో పాట పెడతాడు. అందులో నుండి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అనే పాట వస్తుంది. టీ బాలేకపోవడంతో ఆ పాట కరెక్ట్ గా సింక్ అవుతుంది. ఇక ఒక సిప్ తాగిన అందరు వింతవింత ఎక్స్ ప్రెషన్స్ పెడతారు. అది చూసి ఏమైంది టీ బాలేదా అని మహా వచ్చి అడుగుతుంది. అంటే వదిన అని కన్నా చెప్పబోతుంటే బాగుందని మాధవ కవర్ చేయాలని ట్రై చేస్తాడు. మీరు పెట్టిన టీ మీరు కూడా తాగాలి కదా ఒకసారి తాగండి అని అంటాడు. ఇక తను తాగి ఒక్కసారిగా ఏంటిది అని అంటుంది. అదే టీ అని చక్రి అంటాడు. నేను పంచదార బదులుగా ఉప్పు వేసినట్లున్నానని మహా అంటుంది. అవునని అందరు అంటారు. ఉండండి మళ్ళీ పెడతానని మహా అనగానే వద్దని అందరు రిక్వెస్ట్ చేస్తారు. మీ ఇంట్లో మీరు ఎప్పుడు టీ పెట్టలేదు కాబట్టి ఏం పర్లేదని చక్రి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






