Latest News
కాంగ్రెస్ కు కేంద్రం షాక్.. ఢిల్లీ కార్యాలయం ఖాళీ చేయాలంటూ నోటీసులు
posted on: Mar 25, 2026 1:15PM

కాంగ్రెస్ పార్టీకి కేంద్రం షాక్ ఇచ్చింది. హస్తినలో దాదాపు ఐదు దశాబ్దాలుగా.. స్పష్టంగా చెప్పాలంటే 48 ఏళ్లుగా ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 1978 నుంచీ ఈ నెల 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని ఆ ఆదేశాలలో స్పష్టంగా పేర్కొంది.
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ భవనంతో పాటు.. రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాలని తాఖీదులు పంపింది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీలోని కోట్లా మార్గ్‌లో ఇందిరా భవన్ పేరుతో కొత్త జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకుంది. నిబంధనల మేరకు పార్టీ సొంత కార్యాలయ భవనం నిర్మాణం పూర్తయితే..పాత భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇందిరా భవన్ కు ఏడాది కిందటే సోనియాగాంధీ గత ఏడాదే సోనియా గాంధీ ప్రారంభోత్సవం కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రం అక్బర్ రోడ్డు భవనాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసులపై కాంగ్రెస్ మండి డుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యేనంటూ విమర్శిస్తోంది. ఈ నోటీసులను కోర్టులో సవాల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


.webp)



