వైసీపీ విధ్వంసం నుంచి ఏపీని నిలబెట్టింది కేంద్రమే.. చంద్రబాబు.!

posted on: Jul 17, 2026 5:49PM

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన   ఆర్థిక,  పాలన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కేంద్రమే రక్షించి నిలబెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు ఉద్ఘాటించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన బహుముఖ సహాయ సహకారాల వల్లే రాష్ట్రం నేడు తిరిగి ప్రగతి పథంలోకి వచ్చిందన్నారు. నరసరావుపేట వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక  క్రెడిట్ అవుట్ రీచ్  బహిరంగ సభలో కేంద్ర విత్తమంత్రి  నిర్మలా సీతారామన్‌తో కలిసి   సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలోని దాదాపు లక్షా 3వేల మందికి పైగా లబ్థిదారులకు 3 వేల 216 కోట్ల భారీ రుణాలను చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పంపిణీ చేశారు.  

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక చేయూతను  ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణం, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు  అండగా నిలిచిందన్నారు.   

Chandrababu Naidu, Nirmala Sitharaman, Narasaraopet Credit Outreach, Andhra Pradesh Loans Distribution, AP Economy Recovery

google-ad-img
    Related Sigment News
    • Loading...