Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు హర్షం
posted on: Feb 1, 2026 4:13PM
.webp)
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక శక్తిగా భారత్ ఎదిగేందుకు ప్రస్తుత కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్ అని తెలిపారు. కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిస్తున్నాని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్టు సహకరించేలా ఉంది. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందని ఆయన తెలిపారు.
మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉందని చంద్రబాబు అన్నారు. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై, హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉందని వెల్లడించారు. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయిని ఆయన తెలిపారు.
మన రాష్ట్రంలో అరకులో టూరిజం పెరగడానికి దోహదం చేస్తుంది.కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయి. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారు. భారత్ డేటా సెంటర్ల హబ్ గా తయారవుతుంది. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయని..లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలిపారు.



.webp)


