బడ్జెట్‌లో అమరావతికి గణనీయ కేటాయింపులు

posted on: Feb 1, 2026 3:54PM

 

కేంద్ర బడ్జెట్‌లో అమరావతికి పెద్ద పీట దక్కింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో సుమారు రూ.1,128.91 కోట్లని ప్రాథమికంగా కేటాయించింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్ నిధుల ద్వారా రూ.432.09 కోట్లు, ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం రూ.800 కోట్లు, ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.350 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో రూ.155.32 కోట్లు కేటాయించింది. 

కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల ద్వారా ఏపీలోని ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధనా గ్రాంట్లను ప్రకటించింది. అణుశక్తి విభాగం నుంచి ఎస్‌ఆర్‌ఎం (SRM) అమరావతి, గీతం విశ్వవిద్యాలయం (ఆంధ్రప్రదేశ్) ఎంపిక అయ్యాయి. అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధి కోసం  కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో వీఆర్.సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ (విజయవాడ), త్రిపుల్ ఐటీ (IIIT) శ్రీసిటి, గీతం (బెంగళూరులను ఎంపిక చేసింది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...