Latest News
టీఆర్పీ రేటింగ్ లు బంద్.. టీవీ ఛానళ్లకు కేంద్రం షాక్!
posted on: Mar 7, 2026 1:34PM

టెలివిజన్ ఛానళ్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. నెల రోజుల పాటు చానెళ్లకు టీఆర్పీ రేటింగ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో టీవీ ఛానళ్లు ఉద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తూ టీఆర్పీరేటింగ్ లు పెంచుకోవడానికి చూస్తుండటంపై సీరియస్ అయ్యింది.
ఉద్వేగాలను రెచ్చగొట్టడంతో పాటు యుద్ధానికి సంబంధించి అనవసర భయాలను ప్రజలలో రెచ్చగొట్టేలా ఊహాజనిత వార్తలను ప్రసారం చేస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు వారాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ టీవీ చానెళ్లకు టీఆర్పీ రేటింగ్ ను బంద్ చేసింది. ఈ మేరకు బార్క్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.



.webp)


